శ్రీలంకకు త్వరలో నూతన రాజ్యాంగం రాబోతోంది. తమిళులు, సింహళీయుల మధ్య సయోధ్యను కుదర్చడం, తమిళులకు అన్నింటిలో సమాన హోదా కల్పించడమే లక్ష్యంగా ఈ రాజ్యాంగాన్ని తేబోతున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. శనివారం నాడు కొలంబోలో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన రాజ్యాంగ రచనకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. లంకలో శాంతి సామరస్యాలు నెలకొల్పాలంటే కొత్త రాజ్యాంగం అవసరం ఎంతయినా ఉందని అధ్యక్షుడు మైత్రి పాల సిరిసేన ఎప్పటినుండో చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు అదే క్రమంలో ఆయన కొత్త రాజ్యాంగ రచనకు బాటలు పరిచారు. ఆధునిక లంకకు ఆధునిక రాజ్యాంగం అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
Mobile AppDownload and get updated news