Mobile AppDownload and get updated news
ఇండో స్విస్ టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ 2016ను ఘనంగా ప్రారంభించింది. డబ్ల్యూటిఏ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకుని సంచలనం సృష్టించారు. వారి జోడీ కెరీర్లో వరుసగా ఇది ఆరో టైటిల్ కావడం విశేషం. శనివారం బ్రిస్బేన్లో జరిగిన ఫైనల్స్ లో జర్మనీకి చెందిన టాప్ సీడ్స్ ఏంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ పై 7-5, 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. సానియా జోడీ ఈ మ్యాచ్ ను కేవలం 69 నిమిషాల్లోనే ముగించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ గా ఉన్న సానియా, మార్టినాల కెరీర్లో మొత్తం 26 టోర్నీల్లో విజయం సాధించారు. యూఎస్ ఓపెన్, గువాన్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో వరుసగా విజయం సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ విజయంతో వారి జోడి ప్రపంచంలో సుదీర్ఘకాలంగా విజయాల బాటలో పయనిస్తున్న టెన్నిస్ జోడీగా నిలవడం విశేషం. వారికి ముందు సారా, రాబర్టా పేరిట ఆ రికార్డ్ ఉంది.