ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఆఫ్గనిస్తాన్ లో భారత్, పాక్ ఎంబసీల వద్ద బుధవారం జరిగిన కాల్పుల ఘటన ఇంకా మరువక ముందే జకార్తాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్టు సమాచారం. అక్రమంగా చొరబడిన తీవ్రవాదులు పేలుళ్ల అనంతరం కాల్పులకు తెగబడ్డారు. బాంబులు పేలిన చోట్ల భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. అక్కడ టీవీ ఛానల్స్ చెప్పిన దాని ప్రకారం దాదాపు 14 మంది మిలిటెంట్లు ఘటనలో పాలుపంచుకున్నారు. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ఇండోనేషియాకు ఇంతకుముందే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దాడి చేసింది ఎవరో తమకు ఖచ్చితంగా తెలియదని అన్నారు. బాంబు పేలుళ్లు మొత్తం ఆరు చోట్ల జరిగాయని తెలుస్తోంది. స్టార్ బక్స్ కేఫ్ లో, యూఎన్ కార్యాలయం ముందు, ఓ షాపింగ్ మ్ దగ్గర పేలుళ్లు సంభవించాయి.
Mobile AppDownload and get updated news