Mobile AppDownload and get updated news
కొత్త సినిమా విడుదలైతే... రెండు మూడు రోజుల్లో పైరసీ బయటికి వచ్చేస్తుంది. వెబ్ సైట్లో డౌన్ లోడ్ కోసం సిద్ధంగా ఉంటుంది. రామ్ తాజా సినిమా 'నేను... శైలజ' సినిమా మీకు వెబ్ సైట్లో కనిపించినా కూడా దాని జోలికి పోకండి. డౌన్ లోడ్ చేశారో రెండు లక్షల రూపాయలు జరిమానా పడుతుంది. అవును ఈ సినిమా ఇప్పటికే పైరసీదారులు నెట్‌లో పెట్టడంతో కొంతమంది డౌన్‌లోడ్ చేసుకుని చూశారు. ఈ విషయం స్రవంతి మూవీస్ దృష్టికి వెళ్లింది. దీంతో రవికిశోర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే సినిమాను డౌన్‌లోడ్ చేసుకున్నారో వారి ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకోవడానికి అంతా సిద్ధమయ్యారు. అలా చూసినవారికి రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారట. అలాగే ఆస్ట్రేలియా, అమెరికాలలో కూడా సినిమాను డౌన్‌లోడ్ చేసిన వారికి వార్నర్ బ్రదర్స్, డల్లాస్ మూవీ బయ్యర్స్ సంస్థలు 20 డాలర్ల నుంచి ఏడు వేల డాలర్ల వరకు జరిమనా విధించడానికి అక్కడి కోర్టు అనుమతినిచ్చిందని రవికిశోర్ తెలిపారు.