Mobile AppDownload and get updated news
ఆఫీసులో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తలనొప్పిగా ఉందంటే, వయాగ్రా ఆఫర్ చేశాడు ఓ మేనేజర్. ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది ఇంచర ( పేరు మార్చాం). ఏడాదిగా ఆ కంపెనీలో పనిచేస్తోంది. ఆ కంపెనీ మేనేజర్ 38 ఏళ్ల మల్లప్ప. అతనికి పెళ్లయ్యింది. భార్య అమెరికాలో ఉంటోంది. ఆ ప్రబుద్ధుడు మాత్రం అమ్మాయిలకు వలలేస్తూ ఉంటాడు. మూడు నెలలుగా ఇంచరను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఉద్యోగులు ఎవరూ లేనప్పుడు చున్నీ పట్టుకుని లాగడం, అనవసరంగా తాకడం చేస్తుండే వాడు. పెళ్లి చేసుకుందామని ఓసారి అడిగాడు. అందుకు ఇంచర తిరస్కరించింది. చదువుకు సాయం చేస్తానని, ఆర్థికంగా అండగా ఉంటానంటూ ఇంచర లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఓ రోజు చాలా తలనొప్పిగా ఉంది, బయటికి వెళ్లి మెడిసిన్ తెచ్చుకుంటానని మల్లప్పని పర్మిషన్ అడిగింది. అందుకు ఆ నీచుడు నా దగ్గర మెడిసిన్ ఉంది అంటూ వయాగ్రా తీసి ఇచ్చాడు. ఇంచర కోపం పట్టలేకపోయింది ఇన్నాళ్లు వేధింపులు భరించిన ఆ అమ్మాయి ధైర్యంగా పోలీసు స్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేసింది. తాను చిన్న ఉద్యోగినని, మేనేజర్ మీద ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోరని, అందుకే ఇన్నాళ్లు బాధలు భరించానని తెలిపింది.