బాలీవుడ్ నటుడు ఓ దక్షిణాది సినిమా షూటింగ్ కోసం గురువారం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన సూపర్ హిట్ సినిమా లగాన్ లో నటించిన రాజేష్ వివేక్ ఉపాధ్యాయ. లగాన్ లో ఆయన గోరన్ పాత్రలో కనిపిస్తారు. అతను 1978లో సినీరంగంలో ప్రవేశించారు. మొదట్లో విలన్ గా నటించినా, తరువాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. తెలుగు సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలోనూ ఆయన నటించారు. అందులో ఆయన పాత్ర పేరు పెంబా రాజేష్ హఠాన్మరణంతో బాలీవుడ్ జనాల్లో విచారం అలుముకుంది. ఆయన బాలీవుడ్లో చాలా హిట్ సినిమాలలో నటించారు. జోధా అక్బర్, కరణ్ అర్జున్, బంటి అవుర్ బబ్లీ... ఇలా 60 సినిమాలలో నటించారు.
లగాన్ సినిమాలో...
జోధా అక్బర్ సినిమాలో..
Mobile AppDownload and get updated news