Mobile AppDownload and get updated news
ఈజిప్టులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలోని షేక్ జువైద్ చెక్ పోస్టుని లక్ష్యంగా చేసుకుని గురువారం అర్థరాత్రి దాటాక సాయుధ మిలిటెంట్లు గుంపుగా వచ్చి కాల్పులు ప్రారంభించారు. అక్కడ విధుల్లో ఉన్న రక్షణ దళాలు ఎదురు కాల్పులు మొదలుపెట్టాయి. ఈ ఘటనలో 30 మంది దాకా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు రక్షణ అధికారులు చెబుతున్నారు. అలాగే నలుగురు ఆర్మీ సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు. కాగా పదిమంది దాకా గాయపడ్డారు. జువైద్ నగరాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవాలని మిలిటెంట్లు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న గ్రామస్థులను తరిమికొట్టాలని చూస్తున్నారు. గురువారం ఓ స్కూలు సమీపంలో బాంబు కూడా అమర్చారు. అయితే దానిని భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేశారు. 2013 నుంచి ఈజిప్టులో ఉగ్రకలకలం ఎక్కువైపోయింది.