ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ గాబా మైదానంలో ప్రారంభమైంది. ఓపెన్ శిఖర్ ధావన్ మరోసారి తక్కువ పరుగులకే అవుటైపోయాడు. జట్టు స్కోర్ తొమ్మిదిపరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు 6 పరుగులతో శిఖర్ ధావన్ అవుటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ పారిస్ వేసిన బంతిని ఫోర్ కొట్టడానికి ప్రయత్నించి క్యాచ్ గా దొరికిపోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 19.4 ఓవర్లలో 98 పరుగులు. రోహిత్ శర్మ 51, విరాట్ కోహ్లీ 40 పరుగులుగా క్రీజులో ఉన్నారు.
Mobile AppDownload and get updated news