చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం కోర్టు గుమ్మమెక్కారు. ప్రస్తుత సీఎం జయలలితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 21వ తేదీన జయలలితను విమర్శిస్తూ కరుణానిధి రాసిన వ్యాసం ఓ తమిళ పత్రికలో ప్రచురిత మైంది. కరుణానిధి వ్యాసంతో తన పరువుకు భంగం కలిగిందంటూ సీఎం జయలలిత చైన్నైలోని సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం కరుణానిధి హాజరుకావాలంటూ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయన విచారణకు హాజరయ్యారు. కరుణనిధి నుంచి వివరణ తీసుకున్న కోర్టు తదుపరి విచారణ మార్చి 3వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Mobile AppDownload and get updated news