ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ, ఆయన తనయులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు వైవీఎస్ చౌదరిలు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు.దేశంలో నేడు అమలవుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఎన్టీఆరే స్ఫూర్తి అని ఆయన తనయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.
Mobile AppDownload and get updated news