స్వాతంత్ర్య వీరుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన కీలక దస్త్రాలను కేంద్రం శనివారం నాడు విడుదల చేసింది. వాటిని నేతాజీ కుటుంబ సభ్యులకు అందచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేతాజీ కుటుంబ సభ్యురాలు చిత్రా బోస్ మాట్లాడుతూ నేతాజీకి సంబంధించిన కీలక దస్త్రాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఆహ్వానించారు. ఈ చర్యపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పత్రాల సహకారంతో నేతాజీ మరణానికి సంబంధించి కీలక ఆధారాలను సంపాదించవచ్చన్నారు. ఈ విషయంలో చొరవ చూపిన ప్రధాని మోడీ వైఖరిని ఆమె అభినందించారు. నేతాజీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Mobile AppDownload and get updated news