హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ వేముల రోహిత్ మరణానికి సానుభూతిగా ప్రకటించిన నష్టపరిహారాన్ని స్వీకరించేందుకు అతని కుటుంబం నిరాకరించింది. తన కుమారుడు మరణించిన ఐదు రోజుల తరువాత తీరిగ్గా ప్రధాని మోడీ, కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ స్పందించడం తమను కలచివేసిందని రోహిత్ తల్లి ఆరోపించారు. తన కుమారుడి గురించి స్పందించడానికి ప్రధానికి ఇన్ని రోజులు పట్టిందా అని ఆమె నిలదీశారు. రోహిత్ కుటుంబానికి హెచ్.సి.యూ. రూ.8 లక్షల ఎక్స్గ్రెషియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమకు రూ. 8 లక్షలు కాదు కదా.. రూ. 8 కోట్లు ఇచ్చినా స్వీకరించబోమని రోహిత్ సోదరి నీలిమ చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
Mobile AppDownload and get updated news