Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 85987 articles
Browse latest View live

‘కోయిలమ్మ’ సీరియల్ ఎపిసోడ్‌ : చిన్నీని గుర్తు పట్టిన మేనత్త! మళ్లీ కష్టాలు మొదలు!

$
0
0
గ‌త ఎపిసోడ్‌లో ఏం జ‌రిగిందంటే...చిన్నీ, ధ‌నాలు బండి మీద వ‌స్తుంటే... అంకిత్‌, స‌మీర్‌ల కారు టైర్ పంచ్ అయ్యి.. అదే దారిలో ఆగిపోతుంది. దూరం నుంచే చిన్నీ సమీర్ని చూసి నెత్తిన కొంగు కప్పుకుంటుంది. ధనా సమీర్కి సాయంగా టైర్ తీసుకుని వెళ్లి.. పంచ్ వేయించుకుని.. తిగిరి వస్తాడు. అప్పటిదాకా చిన్నీ ముసుగు వేసుకుని దూరంగా అంకిత్‌ని చూసుకుంటూ బాధపడుతుంది. తర్వాత ధనా వచ్చి చిన్నీని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ టైమ్‌లో తన ముఖం అంకిత్‌కి గానీ, సమీర్‌కి గానీ కనిపించకూడదని జాగ్రత్త పడుతుంది చిన్నీ. 725 ఎపిసోడ్‌ హెలెట్స్...ఇంద్రజ.. తనని, మనోజ్‌ని, లక్ష్మీని మోసం చేసి... సంతకాలు పెట్టించుకుని.. మాతృవందనం ప్రాజెక్ట్‌కి లోన్ రాకుండా చేసిందని తెలుసుకున్న అశోక్ కుమార్.. బాధపడతాడు. జరిగిందంతా లక్ష్మీకి చెప్పుకుని టెన్షన్ పడతాడు. తమ్ముడు మనోజ్ ఇది తెలిస్తే ఎలా అంటూ భయపడతాడు. అవతల మీడియాని పిలిచి.. ప్రెస్ మీట్ పెట్టిన మనోజ్ కుమార్ ‘మాతృవందనం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధం’ అంటూ ప్రకటిస్తాడు. అది విన్న అశోక్ కుమార్ బాధపడుతుంటే.. లక్ష్మీ తన నగలు తీసుకొచ్చి ఇచ్చి.. ‘ప్రస్తుతానికి వీటితో డబ్బు సర్దిపెట్టండి. మిగిలినవి తర్వాత చూద్దాం’ అంటూ నచ్చజెబుతుంది. Read Also: బస్తీలో పిల్లలకు తినేవి, ఆడుకునే వస్తువులూ ఇలా చాలానే తీసుకొస్తుంది చిన్నీ. దాంతో పిల్లలంతా చిన్నీకి దగ్గరవుతారు. ఆటలు పాటలతో వాళ్లని మరింత మచ్చిక చేసుకుంటుంది. చెప్పినట్లుగా విని, చదువుకోవాలని వాళ్లని క్రమశిక్షణలో పెడుతుంది. ఆ సమయంలో తను చిన్నప్పటి నుంచి పాడే ఓ పాట పాడటం మొదలుపెడుతుంది. అది విన్న ధనా వాళ్ల అమ్మ(చిన్నీ మేనత్త) చిన్నప్పటి చిన్నీని గుర్తు చేసుకుంటూ.. గమనిస్తూ ఉంటుంది. అయితే అది గుర్తించని చిన్నీ పాట పాడి పిల్లలని అక్కడున్న బస్తీవాళ్లను తన పాటతో అలరిస్తుంది. కమింగ్ అప్‌లో...‘నువ్వు చిన్నీవే కదా?’ అంటుంది చిన్నీ వాళ్ల మేనత్త. చిన్నీతో సహా.. పక్కనే ఉన్న ధనా కూడా షాక్ అవుతాడు. ‘ఏందమ్మా నువ్వు అనేది చిన్నప్పుడు తప్పిపోయిన మన చిన్నీ, ఈ బుజ్జమ్మా ఇద్దరూ ఒకరేనా?’ అంటాడు. ‘నా కళ్లు నన్ను మోసం చేసినా నా చెవులు నన్ను మోసం చేయవు. నిజం చెప్పు నువ్వు చిన్నీవేగా?’ అంటూ గదమాయిస్తుంది చిన్నీ మేనత్త. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కొనసాగుతుంది.

ఫ్రెండ్‌తో కలిసి భార్యను రేప్ చేసి జననాంగాలపై వాతలు.. కదిరిలో దారుణం

$
0
0
భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తికి దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగక ఆమె జననాంగాలపై వాతలు పెట్టి పైశాచికానందం పొందాడు. జిల్లా కదిరిలో జరిగిన దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also read: తలుపుల మండలం సిద్దిగూరుపల్లికి చెందిన మహిళ(30)కు నాలుగేళ్ల క్రితం సోమేష్‌ నగర్‌కు చెందిన మల్లేశ్వర్‌తో వివాహమైంది. దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా మల్లేశ్వర్‌ భార్యపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్‌ 29న మద్యం తాగి స్నేహితుడు కుమార్‌తో కలిసి ఇంటికి వచ్చిన మల్లేశ్వర్‌ భార్య కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. ఫ్రెండ్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె జననాంగాలపై వాతలు పెట్టాడు. Also read: ఈ ఘటన అనంతరం బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కుమార్తె పరిస్థితిని గమనించిన ఆమె తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో ఉన్న కుమార్తెను చికిత్స కోసం ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చింది. అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు మల్లేశ్వర్‌‌తో పాటు అతడి స్నేహితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలోనూ అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. Also read:

ప్రకాశం జిల్లాలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. రాళ్లతో కొట్టి సజీవదహనం

$
0
0
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలో తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా చంపేశారు. బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా పడివున్నారు. Also Read: వారిద్దరిని దుండుగులు రాళ్లతో కొట్టి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాలను దహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనేనా? లేక దొంగతనానికి వచ్చిన వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. Also Read: ఈ దారుణ ఘటనలో సంతనూతలపాడు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో ఈ ఘటన జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. Also Read:

తూ.గో: మహిళపై అత్యాచారం, హత్య.. నిందితుడు పక్కింటి కుర్రాడే

$
0
0
తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన మహిళ అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది.. పక్కింట్లో ఉండే కుర్రాడని పోలీసులు తేల్చారు. ఆమెను పెద్దమ్మ, పెద్దమ్మ అంటూ పిలుస్తూనే.. నమ్మించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విచారణలో నిందితుడు చెప్పిన విషయాలతో పోలీసులు షాక్ తిన్నారు. ఘటనా ప్రాంతంలో, మృతదేహంపై కారం చల్లి క్రూరంగా ప్రవర్తించాడు. ఐ.పోలవరం మండలం జి.వేమవరంకు చెందిన మహిళ భర్త 15 ఏళ్ల క్రితం చనిపోగా.. కొడుకు నాలుగేళ్ల క్రితం కన్నుమూశాడు. ఆ తర్వాత ఆమె కోడలు, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కూతురు హైదరాబాద్‌లో ఉంటోంది.. ఆమె బాగోగులు మొత్తం రాజమండ్రిలో ఉండే మేనల్లుడు చూసుకుంటున్నాడు. సోమవారం రాత్రి కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి.. యోగ క్షేమాలు అడిగాడు. మేనల్లుడు ఆమెకు ఫోన్ చేసిన సమయంలోనే.. మహిళ ఎవరో తలుపు కొడుతున్నారని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాప్ వచ్చింది. రేపు ఉదయం మాట్లాడదామని అతడు అంతటితో వదిలేశాడు. మంగళవారం ఆమె అనుమానాస్పదరీతిలో చనిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో పొరుగింట్లో ఉండే యువకుడిపై పోలీసులకు అనుమానం రావడంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేసి తర్వాత మెడకు చీర చుట్టి హతమార్చాడు.. ఘటనా స్థలం, మహిళ మొహంపై కారం చల్లి పారిపోయినట్లు చెప్పాడు. అంతేకాదు తనతో పాటూ మరో ఇద్దరు ఈ ఘోరానికి పాల్పడ్డారని చెప్పాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. స్థానికులు అతడ్ని చితకబాదారు. ఏం జరిగిందో నిజం చెప్పాలని గ్రామస్థులు నిలదీయడంతో.. తానొక్కడినే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.. మిగిలిన ఇద్దరి పేర్లు ఎందుకు చెప్పావని స్థానికులు ఇంకో నాలుగు తగిలించారు. చనిపోయిన మహిళను నిందితుడు ఎప్పుడూ పెద్దమ్మ, పెద్దమ్మ అంటూ పిలిచేవాడని.. ఇలాంటి ఘోరానికి పాల్పడతాడని అనుకోలేదన్నారు.

హెచ్‌సీయూలో పీజీ డిప్లొమా కోర్సులు

$
0
0
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 'దూరవిద్య' ద్వారా పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యూనిర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ డిస్టెన్స్ & విజువల్ లెర్నింగ్' 2020 సంవత్సరానికిగాను ఈ ప్రవేశాలను చేపట్టనుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.300 ఆన్‌లైన ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కోర్సుల వివరాలు... ➦ పీజీ డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ➦ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ➦ పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ & నెట్‌వర్కింగ్ ➦ పీజీ డిప్లొమా ఇన్ కెమికల్ అనాలిసిస్ & క్వాలిటీ మేనేజ్‌మెంట్ ➦ పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లా & ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ➦ పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ ➦ పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ & ఫోరెన్సిక్ సైన్స్ ➦ పీజీ డిప్లొమా ఇన్ టెలికమ్యూనికేషన్స్ ➦ పీజీ డిప్లొమా ఇన్ గవర్నెన్స్ ➦ పీజీ డిప్లొమా ఇన్ మెడిసినల్ బోటనీ ➦ పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ ➦ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్ ఇన్ హిందీ అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ఎంపిక విధానం: యూనివర్సిటీ నిబంధనల ప్రకారం. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.300 చివరితేది: 31.01.2020. Read More . . ➦ ➦

‘దిశ’ కేసు ప్రధాన నిందితుడికి అస్వస్థత.. జైల్లోనే వైద్యసేవలు

$
0
0
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచారం ఘటనలో నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లిలో జైలులో ఉన్నారు. వారిని తమ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై షాద్‌నగర్ న్యాయస్థానం ఈరోజు విచారణ జరపనుంది. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. Also Read: చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ మంగళవారం నిందితుల గదులను పరిశీలించి వారితో మాట్లాడారు. జైల్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని నిందితులు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆరిఫ్ అస్వస్థతతో ఉన్నట్లు గుర్తించిన ఆయన డాక్టర్‌తో పరీక్ష చేయించారు. అతడు జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పిన డాక్టర్ కొన్ని మందులు వేసుకోమని ఇచ్చారు. Also Read: ఇదే కేసులో మరో నిందితుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతడికీ వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. నలుగురు నిందితులు తమ గదులు దాటి బయటకు రాకుండా నిత్యం సిబ్బంది పహారా కాస్తున్నారు. వారికి టిఫిన్, భోజనం తలుపు కింద నుంచే అందిస్తు్న్నారు. లోపలే బాత్రూమ్ కూడా ఉంది. మరోవైపు నలుగురు కామాంధులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. Also Read:

హైదరాబాద్ చేరుకున్న టీమిండియా.. నేడు ప్రాక్టీస్

$
0
0
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు భారతజట్టు హైదరాబాద్ చేరుకుంది. వర్క్ షెడ్యూల్‌ మ్యానేజ్ చేసుకోవడంలో భాగంగా బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా జట్టుతో కలిశాడు. ఈ సిరీస్‌కు తను నాయకత్వం వహించాడు. అంతకుముందు కోహ్లీ, కేఎల్ రాహుల్, శివమ్ దూబేలతో కలిసి విమానంలో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. మ్యాచ్‌ వేదిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బ్యాటింగ్ వికెట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Read Also: మరోవైపు ఈ సిరీస్‌కు సంబంధించి జట్టు కూర్పుపై టీమిండియా కసరత్తులు చేస్తోంది. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధవన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో రాహుల్ ఆడటం ఖాయంగా మారింది. రోహిత్‌తో కలిసి తను ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడంతో దూబేకు ప్లేయింగ్ లెవన్‌లో చోటు దక్కడం అనుమానంగా మారింది. బంగ్లాదేశ్ సిరీస్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన దూబే.. నిర్ణయాత్మక ఆఖరిమ్యాచ్‌లో మాత్రం బంతితో మెరిశాడు. అయితే తుదిజట్టు కూర్పు ఎలా ఉండనుందో చూడాలి. ఈరోజు (బుధవారం) జట్టు ప్రాక్టీస్ చేయనుంది. Read Also: మరోవైపు వెస్టిండీస్ ఆటగాళ్లు ఇండియా కంటే ముందే హైదరాబాద్ చేరుకున్నారు. ఆఫ్గానిస్థాన్ సిరీస్ కారణంగా గత కొంతకాలంలో భారత్‌లోనే ఉంటున్న విండీస్ ప్లేయర్లు.. భాగ్యనగరానికి చేరుకుని సాధన కూడా మొదలెట్టేశారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ నాయకత్వంలోని టీమ్ మైదానంలో చెమటోడ్చింది. మూడు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్ శుక్రవారం (ఈనెల 6న) ప్రారంభమవుతుంది. అనంతరం తిరువనంతపురం, ముంబైల్లో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. డిసెంబర్ 15 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ధవన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Read Also:

మత్స్యకారుల వలకు చిక్కిన ఇస్రో రాకెట్ బూస్టర్.. లబోదిబోమన్న జాలర్లు!

$
0
0
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ()కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) రాకెట్ బూస్టర్ పుదుచ్చేరి తీరంలో మత్స్యకారుల వలకు సోమవారం చిక్కింది. పుదుచ్చేరిలోని వంబాకీరపాళ్యానికి చెందిన మత్స్యకారులు సోమవారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి సుమారు 10 నాటికల్‌ మైళ్ల దూరంలో వలకు భారీ బరువున్న వస్తువు చిక్కడంతో దానిని బయటకు లాగడానికి ప్రయత్నించారు. ఆ వస్తువును బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటే వారి పడవ మునిగిపోయే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో నాలుగు పడవలు సాయంతో అతి కష్టమ్మీద దానిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు 30 అడుగుల పొడవున్న ఆ వస్తువును చూసి ఆశ్చర్యపోయారు. మూడు మీటర్ల వ్యాసం, 13.5 మీటర్ల పొడవు, వెడల్పు కలిగి 16 టన్నుల బరువుగల దానిపై ఎఫ్‌ఎల్‌ 119, పీఎస్‌ఎంవో-ఎక్స్‌ఎల్‌ అని, 23.2.2019 అని ఎరుపు రంగులో రాసి ఉంది. రాకెట్ బూస్టర్‌ను వంబాకీరపాళెయం లైట్ హౌస్‌ దగ్గర ఉంచి శ్రీహరికోటలోని షార్‌ కేంద్రానికి సమాచారం అందించారు. షార్‌కు చెందిన జాయింట్ డైరెక్టర్‌ స్థాయి అధికారి సహా నలుగురు పుదుచ్చేరికి చేరుకుని, రాకెట్ బూస్టర్‌ను తీసుకెళ్లేందుకు 16 చక్రాల లారీ, దానిపైకి ఎక్కించేందుకు భారీ క్రేన్‌ను రప్పించారు. అయితే, ఈ బూస్టర్‌ కారణంగా నాలుగు వలలు పూర్తిగా దెబ్బతిని 30 మందికి ఒక రోజు జీవనోపాధి కరువైందని, రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాటిని తరలించకుండా అడ్డుకున్నారు. తమకు కనీసం రూ.10 లక్షలు చెల్లించిన తర్వాతే దీనిని తరలించాలని జాలర్లు డిమాండ్‌ చేశారు. అప్పటి దాకా బూస్టర్‌ను తీసుకెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు, కోస్ట్‌గార్డ్ అధికారులు అక్కడికి చేరుకుని మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాకెట్ బూస్టర్‌ను శ్రీహరికోటకు తరలించారు. కాగా, ఈ బూస్టర్‌ నవంబరు 27న ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహానికి సంబంధించిందని షార్ అధికారులు తెలిపారు. అంతేకాదు, ప్రయోగాలు నిర్వహించేటప్పడు రాకెట్ నుంచి వేరుపడి ఇలాంటి వస్తువులు సముద్రంలో లభించడం సర్వసాధారణమని అన్నారు. ప్రయోగాలు నిర్వహించిన తర్వాత రాకెట్ భాగాలు తీరంలో పడేటప్పుడు జిల్లా అధికారులు, ఇస్రోకు ఫోన్‌చేసి సమాచారం ఇస్తారని, వీటిని ట్రక్కుల సాయంతో వెనక్కు తీసుకొస్తామని అన్నారు. అలాగే విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనాల భాగాలు కూడా మన తీరంలో అప్పుడప్పుడు లభ్యమవుతాయని పేర్కొన్నారు. అయితే, వీటికి దూరంగా ఉండాలని, కొన్నిసార్లు మండకుండా ఉన్న ఇంధనం వల్ల ప్రమాదమని చెప్పారు.

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన పక్కింటి కుర్రాడు.. చివరికి

$
0
0
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువతి స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. బాధితురాలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాడి ఆట కట్టించారు. Also Read: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10లో నివసించే యూసుఫ్‌ ఫరూక్‌ (19) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతడి పక్కింట్లో కొందరు అమ్మాయిలు ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఓ యువతి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా ఫరూక్ కిటికీలో నుంచి చాటుగా చూస్తూ తన సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. అతడిని గమనించిన యువతి వెంటనే బట్టలు వేసుకుని గదిలోకి వెళ్లి డయల్ 100కి ఫోన్ చేసింది. Also Read: కేవలం నాలుగు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి వాంగ్మూలం తీసకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్లో పలు అసభ్య ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఫరూక్ గతంలోనూ ఇదే విధంగా చాలా మంది వీడియోలు తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:

నేవీ డే.. పాక్‌కు భారత నౌకదళ సత్తా ఏంటో తెలిసిన రోజు

$
0
0
పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో డిసెంబరు 4 అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కరాచీ పోర్ట్‌పై మెరుపుదాడిచేసి పాక్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. బంగాళాఖాతంలోని ప్రాదేశిక జలాలను తన స్వాధీనంలోకి భారత్ తేచ్చుకుంది. మరోవైపు వాయుసేన సైతం పాక్ వైమానిక స్థావరాలపై దాడిచేసి కకావికలం చేసింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. ఏటా ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్‌ నిర్వహిస్తున్నాయి. రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఈ రోజు ఉత్సవాలను నిర్వహిస్తారు. క్రమేపీ తీరప్రాంత భద్రతలో నేవీ పాత్ర అత్యంత కీలకంగా మారింది. తీర సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవతా దృక్పథంతో కూడిన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్‌ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఏటా ఘనంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ బ్యాండ్‌ మేళాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. తూర్పు నౌకాదళం ఆర్‌కె.బీచ్‌లో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 1971 డిసెంబర్‌ 4 న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావికాదళం పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపైన మెరుపుదాడి చేసింది. నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసి, బంగాళాఖాతంలో ప్రాదేశిక ప్రాంతాలను నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను కలావికలం చేసింది. భారత సైన్యం ముందు పాక్‌ ఎత్తులు నిలవలేక 15 రోజుల్లోనే డిసెంబర్‌ 16 న పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ జలాంతర్గామి ఘాజీని విశాఖ తూర్పునౌకాదళం సమీపంలో భారత దళాలు ముంచేశాయి. భారత ఉపఖండానికి చెందిన సముద్ర జలాలలో మొదటి జలాంతర్గామి వినాశనం ఇదే తొలిసారి. ఆపరేషన్‌ ట్రైడెంట్‌ పేరుతో భారత నౌకాదళం చేపట్టిన కరాచీ రేవుపై దాడి విజయవంతమైంది. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 4 - 5 రాత్రి పాకిస్తానీ డిస్ట్రోయర్‌ నౌకలు దెబ్బతిని సముద్రంలోనే నాలుగు మునిగిపోయాయి. ఇవి భారత నావికాదళ వ్యూహాత్మక విజయానికి తార్కాణంగా నిలిచాయి. 720 మంది పాక్ నేవీ సైన్యం చనిపోగా, దాయాదికి అపార వాణిజ్య నష్టం కలిగింది. అదే క్రమంలో భారత్‌ వైపున ప్రాణనష్టం జరిగింది. అరేబియా మహా సముద్రంలో భారత్‌ ఫ్రిగేడ్‌ ఐఎన్‌ఎస్‌ ఖుక్రీను ముంచివేసినప్పుడు 18 మంది అధికారులు, 176 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో భారత నౌకాదళానికి జరిగిన అతిపెద్ద నష్టం ఇదే. పాకిస్తాన్‌ మాత్రం తన మూడో వంతు నావికాదళ సైన్యాన్ని కోల్పోయింది. పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ ఖైదీలు సుమారు 90 వేల మంది పట్టుబడగా, ఇండియన్‌ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ నిర్ఘాట్‌, ఐఎన్‌ఎస్‌ వీర్‌, ఐఎన్‌ఎస్‌ నిపాట్‌ ఈ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర పోషించాయి.

ఒక్క నిమిషంలోనే 80 శాతం చార్జింగ్.. అసలు మిస్టరీ ఏంటో తెలుసా?

$
0
0
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ ఫాస్ట్ చార్జింగ్ పైనే దృష్టి పెట్టాయి. ఎందుకంటే పొరపాటున ఫోన్ లో చార్జింగ్ అయిపోతే మళ్లీ అది చార్జ్ అయ్యేదాకా ఎదురు చూడటం కష్టం. ఎందుకంటే మన ఫోన్ తో మనకు ఎన్నో పనులు ఉంటాయి. దీన్నే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా గుర్తించాయి. రియల్ మీ తాజాగా విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఎక్స్2 ప్రోతో 50W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో మీ ఫోన్ 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. Also Read: ఒప్పో కూడా తన రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ తో 65W ఫాస్ట్ చార్జింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెడ్ మీ తాజాగా జరిగిన ఓ సదస్సులో 100W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 17 నిమిషాల్లోనే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. వివో కూడా 120W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీపై ఎప్పట్నుంచో కసరత్తు చేస్తోంది. కానీ ఒకే నిమిషంలో మీ ఫోన్ 0 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కితే? Also Read: అవును. మీరు చదివింది నిజమే! కేవలం ఒక్క నిమిషంలోనే మీ స్మార్ట్ ఫోన్ కు 80 శాతం చార్జింగ్ ను అందించే టెక్నాలజీపై చైనా శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఈ వివరాలు చైనా మీడియాలో వైరల్ గా మారాయి. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ హువాంగ్ యున్ హుయ్ ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీని పెకింగ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ అల్యూమ్నీ ఫోరంలో ప్రదర్శించారు. అయితే ఈ టెక్నాలజీ మొట్టమొదట ఏ కంపెనీకి అందుబాటులోకి వస్తుందనే విషయం మిస్టరీగానే ఉండిపోయింది. Also Read: అయితే ఈ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు. ఒక వేళ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఇదే అవుతుంది. ఈ టెక్నాలజీని వేగంగా అమల్లోకి తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ల అవసరాన్ని తీరుస్తామని పరిశోధకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

'రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమా.. ఇదేనా మీ పవనిజం?'

$
0
0
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు నిందితులపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమయ్యాయా అంటూ ప్రశ్నించారు. ఇదేనా పవనిజం.. రాజకీయ పార్టీ ఇందుకే పెట్టారా అంటూ.. ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. దేశమంతా రేపిస్టుల్ని కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే.. ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి అన్నారు. పవనిజం అంటే ఇదేనేమో.. రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా అంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు.. నిందితులకు శిక్షపై స్పందించారు. ఆమెపై హత్యాచారం చేసిన నలుగురు నిందితుల్ని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారని.. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారని గుర్తు చేశారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి అన్నారు. ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూనే విజయసాయిరెడ్డి పవన్‌పై మండిపడ్డారు.

హైదరాబాద్‌లో మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి.. 20 రోజుల క్రితమే ప్రేమపెళ్లి

$
0
0
హైదరాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో అనుమానాస్పద మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సనత్‌నగర్‌లో నివసించే పూర్ణిమ ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే దాసరి కార్తీక్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. Also Read: అయితే పూర్ణిమ బుధవారం తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే తమ కూతురిని భర్త కార్తీకే కొట్టి చంపేశాడని పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: పూర్ణిమ మృతికి కారణమైన కార్తీక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సనత్‌నగర్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు పూర్ణిమ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. Also Read:

సహనటితో టీవీ నటుడి అక్రమ సంబంధం.. భార్య ఫిర్యాదుతో జైలుకి

$
0
0
తమిళంలో బుల్లితెరపై అక్రమ సంబంధం వ్యవహారం కలకలం రేపుతోంది. టీవీ నటుడైన ఈశ్వర్‌ తనను పట్టించుకోకుండా మరో నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య, టీవీ నటి జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘వంశం’ సీరియల్‌ ద్వారా సుపరిచితమైన నటి జయశ్రీ....తన సహనటుడు ఈశ్వర్‌‌ రఘునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరువాన్మయూర్‌ కామరాజర్‌ నగర్‌లో కాపురం ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. Also Read: భర్త తన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్స్‌ను తనఖా పెట్టాడని, రోజూ కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని జయశ్రీ అడయార్‌లోని మహిళా పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు తెలియడంతో ఈశ్వర్‌ను సోమవారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన జయశ్రీ భర్తపై మరో ఫిర్యాదు చేసింది. Also Read: భర్తను అరెస్ట్ చేయించడంతో తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తన భర్త ఈశ్వర్‌ సహనటితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు తాగుడు, ఇతర వ్యసనాలకు బానిసై తనను వేధిస్తున్నాడని జయశ్రీ ఆరోపిస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న నటికి తన ముందే వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని, అతడి వేధింపులు భరించలేకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మరోవైపు జయశ్రీకి వస్తున్న బెదిరింపు కాల్స్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:

తిరుమల శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్

$
0
0
రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు.. మొక్కులు చెల్లించుకున్నారు. పవన్‌తో పాటూ నాదెండ్ల మనోహర్.. ఇతర పార్టీ నేతలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు జనసేనాని. తిరుపతిలో తాను యోగాభ్యాసం చేశానన్నారు పవన్ కళ్యాణ్. మూడు దశాబ్దాల క్రితం ఈ ఏడుకొండల స్వామి సన్నిధిలో ధర్మో రక్షతి రక్షితః అని నేర్చుకున్నానని అన్నారు. త్రికరణ శుద్ధిగా ఇప్పటికీ అదే పాటిస్తున్నానని.. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర్ స్వామివారిని ప్రార్థించానన్నారు పవన్ కళ్యాణ్. Read Also: పవన్ కళ్యాణ్ నాలుగు రోజులుగా రాయలసీమలో పర్యటిస్తున్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ టూర్ కొనసాగుతోంది. ఈ పర్యటనలో నియోజకవర్గాల వారీగా సమీక్షలతో పాటూ పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. అలాగే రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు.. ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు పడుతున్నవారిని కలిసి.. వారి ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. మంగళవారం తిరుపతిలోని రైతు బజారులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ స్థానికులు, ఉల్లి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. జగన్ సర్కార్ తీరుపై పవన్ మండిపడ్డారు. సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు పవన్.

బీజేపీ అగ్రనాయకులు నా ఓటమికి పని చేశారు.. రాజాసింగ్ అసంతృప్త స్వరం

$
0
0
తెలంగాణలో బీజేపీకి ఉన్న ఏకైక అసంతృప్త స్వరం వినిపించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అసలు తనను పట్టించుకోవడమే లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీలో ఎదగడం కొందరు బీజేపీ నాయకులకు నచ్చట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవిలో ఉండడం వల్లే డాక్టర్ కె.లక్ష్మణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్లే సొంత నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టలేకపోయారని వివరించారు. మరోవైపు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అసలు ప్రోటోకాలే పాటించటం లేదని విమర్శించారు. తన నియోజకవర్గమైన గోషామహల్‌ పర్యటనకు వస్తే తనకు సమాచారమే ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్‌ పాటించేవారని గుర్తు చేశారు. Also Read: ‘బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌తో పాటు డీకే అరుణ వంటి వారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హులే. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ ఆర్థికంగా కూడా శక్తిమంతుడు. నా విషయానికి వస్తే.. హిందూ ధర్మం, గో సంరక్షణే నాకు సంతృప్తి నిచ్చే విషయాలు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాకు రాజకీయ మార్గదర్శి లాంటి వారు. అధ్యక్ష పదవిపై నాకు ఏనాడూ ఆశ లేదు. తెలంగాణ భాజపాలోని అగ్ర నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో నా ఓటమి కోసం పని చేస్తే.. నా నియోజకవర్గ కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి నన్ను గెలిపించుకున్నారు’’ అని రాజా సింగ్‌ అన్నారు. Also Read:

దారుణం.. ఐదుగురు సహచరులను కాల్చి చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డ ఐటీబీపీ జవాన్!

$
0
0
ఛత్తీస్‌గఢ్‌లో ఇండో టిబెటన్ పోలీసుల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణలో ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణ్‌పూర్ జిల్లాలోని కదేనార్ క్యాంపులో చోటు చేసుకుంది. ఓ వివాదం విషయమై కానిస్టేబుల్ ఆగ్రహానికి లోనై.. సహచరులపై కాల్పులకు దిగినట్టు సమాచారం. అనంతరం తాను కూడా కాల్చుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఐటీబీపీ జవాన్లు చనిపోయిన విషయాన్ని నారాయణ్‌పూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. కాల్పులకు దిగిన జగన్‌ను అడ్డుకోబోయిన మిగతా జవాన్లకు కూడా ఈ ఘటనలో గాయలైనట్టు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌‌లో ఖాళీలు

$
0
0
లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్‌ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(హెచ్ఎఫ్ఎల్) దేశ‌వ్యాప్తంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. Read Also: వివరాలు...* అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులురాష్ట్రాలవారీగా ఖాళీలు..
ఛత్తీస్‌గఢ్ 01
మధ్యప్రదేశ్ 01
బిహార్ 01
ఒడిశా 01
అసోం 01
వెస్ట్ బెంగాల్ 02
ఉత్తర్ ప్రదేశ్ 04
ఢిల్లీ 03
రాజస్థాన్ 01
చండీగఢ్ 01
కర్ణాటక 04
ఆంధ్రప్రదేశ్ 01
తెలంగాణ 02
కేరళ 01
తమిళనాడు 05
గుజరాత్ 01
మహారాష్ట్ర 05
మొత్తం ఖాళీలు 35
అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూట‌ర్ స్కిల్స్‌ తప్పనిసరి. Read Also: వయోపరిమితి: 01.01.2019 నాటికి 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా. రాతపరీక్ష విధానం.. ➦ మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ➦ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి. ➦ పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). ➦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జీతం: రూ.56,000. Read Also: ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 02.12.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 16.12.2019
ఆన్‌లైన్ పరీక్షతేది 27.01.2020
Read More.. ➦ ➦

నా వక్షోజాలపై కొట్టాడు: షాకింగ్ ఘటనను షేర్ చేసుకున్న కంగన

$
0
0
బాలీవుడ్ క్వీన్ స్కూల్‌లో ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్ సంఘటన ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో బయటపెట్టారు. కంగన చండీఘడ్‌లో చదువుకున్నారు. స్కూల్‌కి వెళ్లే రోజుల్లో అబ్బాయిలు బైక్‌లపై వచ్చి ఆడపిల్లలను ఎక్కడపడితే అక్కడ టచ్ చేసేవారట. ఓ బైకర్ తన దగ్గరికి వేగంగా వచ్చి వక్షోజాలపై గుద్దాడట. దాంతో కంగన కళ్లు తిరిగి పడిపోయారు. దాదాపు ఐదు నిమిషాల వరకు స్పృహలోకి రాలేదట. స్పృహ వచ్చాక ఈ ఘటనను ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు. ఎలాంటి విషయాలపైనైనా బోల్డ్ కామెంట్స్ చేయడం కంగనకు వెన్నతో పెట్టిన విద్య. చిన్నప్పుడు తనకు అలాంటి ఘటన ఎదురైతే ఎవరైనా చూసుంటారేమోనని భయపడ్డానని, కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చినా కూడా నరికి పారేసే ధైర్యం ఉందని అన్నారు. ఎందరో నటీమణులకు కంగన రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. అక్కినేని కోడలు సమంతకు కూడా కంగన అంటే చాలా ఇష్టం. కంగనలా మాట్లాడే ధైర్యం తమకు కూడా ఉంటే ఎంతో బాగుండు అని చాలా మంది నటీమణులు అన్నారు. ప్రస్తుతం కంగన ‘తలైవి’ బయోపిక్‌తో బిజీగా ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఈ సినిమాను ఏ ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ వైరల్ అయింది. జయలలితలా కాస్త లావుగా కనిపించడానికి కంగన కొన్ని స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో పాటు ఆమె ‘పంగా’, ‘ధాకడ్’ సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతేకాదు మణికర్ణిక ఫిలింస్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. అయోధ్య కేసుపై తొలి సినిమాను తీయబోతున్నారు.

వేరే పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ప్రియురాలిని రేప్ చేసిన మృగాడు

$
0
0
తాను ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదన్న అక్కసుతో ఓ యువకుడు కామాంధుడిగా మారాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడాన్ని తట్టుకోలేక కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని పేర్ణాంబట్టు సమీప ప్రాంతానికి చెందిన మదన్‌కుమార్ అనే యువకుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో ఏర్పడిన పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. Also Read: అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెకు యువకుడితో వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తనతో వచ్చేయాలని ప్రియురాలిని కోరగా.. తాను రానని చెప్పింది. దీన్ని మనసులో పెట్టుకున్న మదన్.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. నవంబర్ 29న ఆమెను కిడ్నాప్ చేసి ఏపీలోని తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ లాడ్జిలో గది తీసుకుని ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మేల్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో విచారణ చేపట్టిన పోలీసుల మదన్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పేర్ణాంబట్టు బస్టాండ్‌లో అదుపులోకి తీసుకుని యువతిని రక్షించారు. తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి చేయడాన్ని ఇష్టపడకే ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
Viewing all 85987 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>