Mobile AppDownload and get updated news
మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ త్వరలో సత్య శోధనా (లై డిటెక్టర్) పరీక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆయన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితితో ఓ హోటల్ రూంలో చనిపోవడం, అప్పటి నుంచి ఆ కేసులో విచారణ కొనసాగడం తెలిసిందే. ఎయిమ్స్ వైద్యులు సునందా విషప్రభావం వల్లే చనిపోయినట్టు కొన్ని రోజుల క్రితమే తేల్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారించడం మొదలుపెట్టారు. శశి థరూర్ డ్రైవర్, సహాయకులు భజరంగి, నరైన్, దీవాన్‌లను మరోసారి విచారించారు. వారే సునందకు మందులు తెచ్చిస్తుంటారు. ఆమె చనిపోయేముందు వాడిన అల్ర్పాక్స్ టాబ్లెట్లను కూడా వాళ్లే తెచ్చిచ్చినట్టు సమాచారం. అలాగే పలువురు మందుల షాపుల యజమానులను పోలీసులు విచారించారు. అలాగు సునందను పరీక్షించిన వైద్యుడిని కూడా పోలీసులు ప్రశ్నించారు. వీరితో పాటూ శశిథరూర్ ని కూడా తిరిగి ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఆయన చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.