ఎంతో హైడ్రామా అనంతరం భారీ బందోబస్తు మధ్య కెప్టేన్ షాహిద్ అఫ్రీది నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం కోల్‌కతాకి చేరుకుంది. సోమవారంనాడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాక్ జట్టు శ్రీలంక టీమ్‌తో ఓ వామప్ మ్యాచ్ ఆడనుంది. అయితే భారత్, పాక్‌తోపాటు ప్రపంచదేశాల క్రికెట్ అభిమానుల ఫోకస్ మాత్రం ఈ నెల 19న ఇదే ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పైనే వుంది. 15 మంది ఆటగాళ్లు, 12 మంది అధికారులు, సహాయ సిబ్బందితో కలిసి కోల్‌కతా చేరుకున్న పాక్ జట్టుకి తన నగరంలో ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించినందుకు ఆనందం వ్యక్తంచేశారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరబ్ గంగూలి. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు శహర్యర్ ఖాన్ కూడా తనకి ఇష్టమైన కొన్ని నగరాల్లో ఒకటైన కోల్‌కతాకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా వుందని అభిప్రాయపడ్డారు.
Mobile AppDownload and get updated news