అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూ ఓర్లియాన్స్ లోని ఓ పార్కులో ఇద్దరు ఆయుధాలు ధరించిన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఘటన జరిగినప్పుడు అక్కడ అయిదు వందల మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారంం రాత్రి ఏడు గంటల సమయంలో ఉదంతం చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో దాదాపు 16 మంది గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు చేశారు? అనే విషయాలు తెలియరాలేదు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చారు. ఆ ఏరియా అంతా అంబులెన్స్ మోతలే.
Mobile AppDownload and get updated news