Mobile AppDownload and get updated news
ఆదివారం అర్థరాత్రి దాటాక పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఆఫ్గనిస్తాన్లో కాబూల్ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. అక్కడ ఇళ్లు కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఢిల్లీలో కూడా స్పల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.9 గా భూకంప తీవ్రత నమోదైంది. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ కు 300 కిలోమీటర్ల దూరంలో, 92.4 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఆఫ్గనిస్తాన్ కు తరచూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హిందూ ఖుష్ పర్వత శ్రేణుల్లో ఏర్పడుతుంటాయి. ఈ శ్రేణులు భూగర్భంలో యురేషియా, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ కలిసే చోట ఉన్నాయి. అందుకే తరచూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. పాకిస్తాన్లో అక్టోబరఱ్ 2005లో పెద్ద భూకంపం సంభవించింది. ఆ దుర్ఘటనలో 75,000 మంది చనిపోగా, 3.5 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.