కొన్ని రోజులుగా వర్షాలతో వణికిపోతున్న నెల్లూరు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మునిగిపోయిన గ్రామాలు, కాలనీలు వరద నీటి నుంచి తేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో సోమవారం మళ్లీ నెల్లూరు భారీ వర్షం కురిసింది. గూడూరు డివిజన్లో ఈ ఉదయం నుంచి వర్షాలు కుమ్మేస్తున్నాయి. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఉప్పుటేరు కాలువ పొంగి తిప్పగుంటపాలెం గ్రామం వరదనీటితో నిండింది. అలాగా పేరపాటి తిప్ప, రంగనాథపురం గ్రామాలు నీటితో నిండాయి. ఆ మూడు గ్రామాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ 54 గ్రామాలు, కాలనీలు వరద నీటిలోనే ఇంకా ఉన్నాయి.
Mobile AppDownload and get updated news