ఈసారి ఈ ఫ్యాన్ సినిమాకి అవార్డ్ రాకపోతే కచ్చితంగా నేనే అవార్డుని ఎత్తుకెళ్తాను... లేదంటే ఏడుస్తాను. ఈ మాటలన్నది ఎవరో కాదు... ఇప్పటికే తన సినీప్రయాణంలో ఎన్నో లెక్కలేనన్ని అవార్డులు గెలుచుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్! అవును, ఇండియా టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ ఈ వ్యాఖ్యలుచేశారు. ఫ్యాన్ సినిమా షారుఖ్ ఖాన్‌కి ఇచ్చిన శాటిస్‌ఫాక్షన్, కాన్ఫిడెంట్ అటువంటిది మరి. ఇదే ఏడాది సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్', అక్షయ్ కుమార్ హీరోగా 'రుస్తోం', అమీర్ ఖాన్ 'దంగల్', మళ్లీ షారుఖ్ ఖాన్ లీడ్ రోల్లో 'రాయిస్' సినిమాలు బాలీవుడ్‌లో విడుదలకి సిద్ధంగా వున్నాయి. ఈ సినిమాలన్నింటితో పోటీని తట్టుకుని షారుఖ్ ఈ ఏడాది అవార్డుని 'కొట్టేస్తాడో' లేదో వేచిచూడాల్సిందే మరి!!
Mobile AppDownload and get updated news