హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టీడీపీ చీఫ్ ఎల్. రమణ అధ్యక్షతన తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పుంజుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ చార్జ్ ల నియామకంపై కూడా చర్చ జరిగింది. టి.టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టదల్చిన కరవు యాత్రపై ఈ సమావేశం లో చర్చించారు. దీంతో పాటు పలు ప్రజా సమస్యలపై పార్టీ నేతలు సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో టి.టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు మోత్కుపల్లి, నామా నాగేశ్వరరావు పార్టీ ముఖ్య నేతలు,వివిధ జిల్లా నుంచి వచ్చిన టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news