శశికళ(పేరు మార్చబడింది) అనే మరో సెక్స్ వర్కర్ కూడా సునీత అభిప్రాయానికే తన ఓటు అంటోంది. శశికళకి ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరి పెళ్లిళ్లు అయిపోయాయి. వారి చదువులకి అవసరమైన డబ్బుని అమ్మ ఎలా సంపాదిస్తోందో అనే విషయం ఆ పిల్లలకి తెలుసు. 'నా పిల్లల పెళ్లిళ్లకి ముందే రాబోయే కోడళ్లకి కూడా మొత్తం పరిస్థితి వివరించాను. టైలర్‌గా పని చేసి కూడా డబ్బులు సంపాదించగలను. కానీ ఆ సంపాదన అంతగా సరిపోదు. ఇక సమాజంలో గౌరవం గురించి నాకు బెంగ లేదు. ఎందుకంటే నా గురించి తెలిసిన వారెవరైనా నాకు గౌరవం ఇస్తారు' అని ధీమాగా చెబుతోంది శశికళ.
వేశ్య వృత్తిలో కొనసాగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకి సాధికారత, స్వయం ఉపాధి కల్పించి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సాలిడరిటీ ఫౌండేషన్ తాజాగా వారితో ముచ్చటించిన సందర్భంలో కొంతమంది మహిళలు పంచుకున్న అభిప్రాయాలు ఇవి. ఒక వేశ్య కూతురు వేశ్య వృత్తినే ఎంచుకుంటుందనే చెడు భావనలో చాలా మంది వున్నారు. అందుకే వారి సంతానం పట్ల సమాజం చిన్నచూపు చూస్తోంది అని ఆవేదన వ్యక్తంచేశారు సాలిడరిటీ పౌండేషన్ సంస్థ ప్రతినిధి అయిన శుభా చాకో. ఇంకొన్ని సందర్భాల్లో వారు ఏమి చేస్తున్నారో వారి కన్నబిడ్డలకి సైతం సరిగ్గా వివరించి చెప్పలేని దుస్థితి ఆ తల్లులది. ముఖ్యంగా ఆ పిల్లలు చదువుకుంటున్న స్కూళ్లలో మీ కన్న తండ్రి ఎవరు ? అనే ప్రశ్న ఎదురైన సందర్భంలో వారు మరింత మానసిక సంఘర్షణకి గురవుతుంటారు. అసలు విషయం చెబితే అప్పటి నుంచి వారి పిల్లల ప్రవర్తనలో తేడా వచ్చే అవకాశం వుంటుంది. అందుకే సమాజంలో సెక్స్ వర్కర్ల పట్ల దృక్పథాన్ని మార్చి వారి ఇబ్బందులని తొలగించాలనేదే తమ లక్ష్యం అని వివరించారు చాకో.
ఇప్పటికే వేశ్యలంటే ఏదో పబ్లిక్ ప్రాపర్టీ అనే చిన్నచూపు వుంది. ఆ చిన్నచూపు కారణంగానే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వారు తగిన విధంగా న్యాయం పొందలేకపోతున్నారు. కానీ వాస్తవానికి వేశ్యల పట్ల చాలామందికి వున్న చెడు దృక్పథం మారాలి. ఎందుకంటే వారి పిల్లలు కూడా ఇప్పుడు ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తున్నారు. కొంతమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా.. ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అలా ఉన్నతస్థాయికి ఎదిగిన వారి పిల్లలు ఆ తర్వాత తమ తల్లిదండ్రులకి చేయుతనందిస్తున్నారు. సెక్స్ వర్కర్లకి అండగా నిలుస్తున్న ఎన్జీఓ సంస్థల్లో చేరాల్సిందిగా కొంతమంది తమ పేరెంట్స్‌కి ప్రోద్బలం అందిస్తున్నారు.
Mobile AppDownload and get updated news