కువైట్ డిజైనర్ అలీ యూన్స్ రూపొందించిన గౌనులో ఈ అందాల తార హోయలకి అక్కడి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించడంతోపాటు లారియల్‌కి అంబాసిడర్‌గా వెళ్లిన ఐష్ తాజాగా మా లోట్(స్లాక్ బే) చిత్ర ప్రదర్శనలో పాల్గొన్నారు.
సన్నని లోహపు తీగ వంటి మెటీరియల్‌తో రూపొందించిన గౌనులో, అలా గాలికొదిలేసిన జుట్టు, బ్లూ కలర్ ఐల్యాషెస్‌తో ఐష్ లుక్ ఆకర్షణీయంగా కనిపించింది.
ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకుగాను ఐష్ గురువారమే తన కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్‌తో కలిసి కేన్స్‌కి వెళ్లారు.
ఆదివారం ఇదే కేన్స్ వేదికపై సరబ్‌జిత్ చిత్ర ప్రీమియర్ కూడా జరగనుంది.
Mobile AppDownload and get updated news