Mobile AppDownload and get updated news
అల్లు శిరీష్ హీరోగా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలందుకున్న మెహరీన్ ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే స్వయంగా వెల్లడించారు. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' తర్వాత శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ... "శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ వారికిది తెలుగులో రెండో చిత్రం కాగా, నాకు నాల్గవ చిత్రం. డైరెక్టర్ ఎం.వి.ఎన్. రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో బన్ని అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహరీన్‌ను ఫైనల్ చేశాం. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో మెహరీన్ నటనకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రంలో మా క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా.. ఎంటర్‌టైనింగ్‌గా ఉండనున్నాయి. ఈ చిత్రానికి సంజయ్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత ఈ సినిమా జులై నుంచి సెట్స్ మీదకి వెళ్తుంది" అని అన్నారు.