నీట్ ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ కేంద్ర కేబినెట్ ఆర్టినెన్స్ జారీ చేయడంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా మాట్లాడుతూ నీట్ వాయిదా పడిన నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల విడుదలకు మార్గం సులువైందన్నారు. ఫలితాలు శనివారం విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. వచ్చే ఏడాది నీట్ సన్నద్ధతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నీట్ వాయిదా కోరుతూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని .. ఫలితంగా ఈ రోజు ఈ నిర్ణయం వెలువడిందని మంత్రి గంటా అన్నారు.
Mobile AppDownload and get updated news