మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, తనూజ ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో విభిన్న కథాంశంతో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం సంజీవని. రవి వీడే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హిమాలయాలు, రోటాంగ్, మనాలి, నల్లమల తదితర లొకేషన్లలో చాలా సాహసోపేతంగా చిత్రీకరించబడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వెక్టార్ ఎఫ్‌ఎక్స్ స్టూడియోలో గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్‌కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సాధ్యమయినన్ని ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Mobile AppDownload and get updated news