తన బర్త్‌డే కానుకగా అభిమానులకి ఒక రోజు ముందే తన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అందించిన తారక్ ఇప్పుడా ఫస్ట్ లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో బర్త్ డే బాయ్‌కి అభిమానులు, సనీ పరిశ్రమకి చెందిన సన్నిహిత మిత్రుల నుంచి బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. తారక్‌కి శుభాకాంక్షలు చెప్పి, జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ బాగుందని కితాబిచ్చిన సినీప్రముఖుల్లో ఎన్టీఆర్ సన్నిహిత మిత్రుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వున్నాడు. శుక్రవారం ఉదయం ట్విటర్ ద్వారా తారక్‌కి గ్రీటింగ్స్ తెలిపిన బన్ని.. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ బాగుందంటూ ట్వీట్ చేశాడు. బన్ని ఇచ్చిన ఈ ట్వీట్‌తో తారక్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారని ట్విటర్ ట్రెండ్స్ చెబుతున్నాయి.
Mobile AppDownload and get updated news