వెనకబడిన తరగతుల మంత్రిగా పనిచేసిన ఉపేన్ బిశ్వాస్ ఉత్తర 24 పరగణాల నియోజకవర్గం నుండి పోటీచేసి అదే పార్టీకి చెందిన మాజీ నేత దులాల్ బార్ చేతిలో ఓడిపోయారు. ఆ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఇంధన మంత్రి మనీశ్ గుప్తా సీపీఎం అభ్యర్థి సుజన్ చక్రవర్తి చేతిలో 9వేల ఓట్లతేడాతో పరాజయం పాలయ్యారు. మరో మాజీ మంత్రి చంద్రిమా భట్టాచార్య (వైద్యం, న్యాయశాఖ) కూడా సీపీఎం తన్మయ్ భట్టాచార్య చేతిలో ఓడిపోయారు. ఆమెపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఫుడ్ ప్రోసెసింగ్ హార్టీకల్చర్ మంత్రిగా చేసిన కృష్ణేందు నారాయణ్ చౌదురి, సావిత్రి మిత్రా (ప్రస్తుతం ఎటువంటి శాఖలేని మంత్రి)లు కూడా ఓడిపోయారు. ఇక పిడబ్ల్యూడి మాజీ మంత్రి శంకర్ చక్రవర్తి, లైబ్రరీ మంత్రి అబ్దుల్ కరీమ్ చౌదురి, టెక్స్ట్టైల్ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలు కూడా ఓడిపోయారు. అయితే, వీరి ఓటమి వల్ల మమతా బెనర్జీ ప్రభుత్వానికి రానున్న కాలంలో వచ్చిన సమస్యేమీ లేదని, పైగా ఆమెకు వారి ఓటమి లాభిస్తుందనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓడిపోయిన మంత్రులందరిపై అవినీతి సహా పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోకి నిష్కలంక నేతలను తీసుకుని వారితో పనిచేయించే అవకాశం మమతాకు దక్కిందంటున్నారు.
ఓడిన మాజీ మంత్రులు....
(చంద్రిమా
Mobile AppDownload and get updated news