ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో తృణమూల్ విజయోత్సవాలను శృతిమించనీయవద్దని పార్టీ శ్రేణులకు మమతాబెనర్జీ సూచించారు. విజయాన్ని వినయంగా స్వీకరించి ప్రజల సేవకు పునరంకితం కావాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన మమత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని, రాష్ట్రపతులతో పాటు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల్లోని ప్రముఖులు, పార్టీల నేతలు, సినీతారలతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను మమతాబెనర్జీ ఆహ్వానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఆమె ఆహ్వానించారు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Mobile AppDownload and get updated news