కేరళలో సీఎం ఎంపిక విషయం ఇప్పుడు సీపీఎంలో చిచ్చు రేపుతోంది. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి లెఫ్ట్ అధికారంలోకి వచ్చింది.దీని వెనుక ప్రధానపాత్ర పార్టీలో అత్యంత సీనియర్ నేత అచ్యుతానందన్ దే. సీపీఎం నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (92) అంటే కేరళ అంతటా ఎంతో ప్రజాదరణ ఉంది. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారిలో ఆయన అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తాజా ఎన్నికల్లో ఆయన పార్టీకి కీలక ప్రచారకర్తగా వ్యవహరించారు. 140 స్థానాలున్న శాసనసభలో 91 స్థానాలు గెలుచుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించారు. అందుకు ఫలితంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అచ్యుతానందన్ ఆశించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం రాష్ట్ర 22వ ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
![]()
విజయన్ ప్రస్తుతం సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు అచ్యుతానందన్ కు పడదని పార్టీలో అందరికీ తెలుసు. అలాంటిది తాను కష్టపడి పార్టీని గెలిపిస్తే విజయన్‌ను సీఎం పదవికి ఎంపిక చేసినట్లు తెలియజేయడంతో అచ్యుతానందన్ ఆగ్రహంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు.
Mobile AppDownload and get updated news