Mobile AppDownload and get updated news
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పునర్వినియోగ అంతరిక్ష వాహన నౌకను (ఆర్ఎల్వీ) విజయవంతంగా ప్రయోగించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు రాకెట్‌ను ప్రయోగించింది. ధ్వని వేగం కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించిన రాకెట్ 70 కిలోమీటర్లు వెళ్లి తిరిగి భూమిని చేరింది. దాదాపు 11 నిమిషాల్లో ఈ రాకెట్ ప్రయోగం జరిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్‌వే పై రాకెట్ దిగింది. రాకెట్ దిగగానే... శాస్రేవేత్తల్లో ఆనందం వ్యక్తం అయింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అవడం వల్ల ఇకపై జరిగే ప్రయోగాల ఖర్చు పదిరెట్లు తగ్గిపోతుంది. రాకెట్ పరికరాలను తిరిగి వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా భూమికి తీసుకురావడం సులభమవుతుంది.