కేరళ: ఇండియన్ రిజర్వడ్ బెటాలియన్ అభ్యర్ధుల ధర్నా ఉద్రిక్తతలను దారి తీసింది. తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో కొందరు అభ్యర్ధులు మంగళవారం అత్మహత్యకు యత్నించారు. వాస్తవానికి రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి లిస్ట్ 2010లోనేప్రభుత్వం ప్రకటించింది.. అయితే ఇప్పటి వరకు నియామకాలు జరగలేదు. దీంతో అభ్యర్ధులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడంతో గత ఆరురోజుల నుంచి త్రివేంద్రం సెక్రటేరియట్ ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం వీరి దీక్షను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్ధులు సమీపంలోని ఓ చెట్టు ఎక్కి తమ సమస్యలను పరిష్కరించకపోతే కిందికి దూకేస్తామని హెచ్చరించారు.
![]()
అభ్యర్ధులను కిందికి దించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం రాలేదు. దీంతో కేరళ సర్కార్.. అభ్యర్ధులను చర్చలకు ఆహ్వానించారు. సమస్యను పరిష్కరిస్తానని సీఎం విజయన్ హామీ ఇవ్వడంతో అభ్యర్ధులు కిందికి దిగారు. దీంతో పోలీసులు, స్థానిక జనాలు ఊపిరి పీల్చుకున్నారు.
Mobile AppDownload and get updated news