రియో ఒలింపిక్స్ లో జూడోలో పురుషుల 90 కిలోల విభాగంలో జరిగిన పోటీల్లో ఇండియాకు నిరాశే ఎదురైంది. 1/32 ఎలిమినేషన్ రౌండ్ లో జరిగిన పోటీల్లో భారత జుడోకా అవతార్ సింగ్ (24) సత్తా చాటలేకపోయాడు. ఒలింపిక్స్ శరణార్థుల జట్టుకు చెందిన మిసెంగా పొపొలె చేతిలో ఓడిపోయాడు. పంజాబ్ కు చెందిన అవతార్ ప్రస్తుతం పంజాబ్ ఆర్మ్ డ్ పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షిల్లాంగ్ లో జరిగిన దక్షిణాసియా గేమ్స్ లో అవతార్ బంగారు పతకం సాధించాడు. అయితే రియోలో మాత్రం నిరాశపరిచాడు.
Mobile AppDownload and get updated news