రియో ఒలింపిక్స్ లో ఆర్చరీలో ఐదో రోజు కాస్త ఆశాజనక ఫలితాలు వచ్చాయి. భారత మహిళా ఆర్చర్ బాంబేలా దేవి గురి అదిరింది. తైపీ క్రీడాకారిణి లిన్‌షి చియాను ఓడించి మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ప్రీక్వార్టర్స్ కు అర్హత సాధించారు. రౌండ్ 64లో బాంబేలా దేవికి ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బాల్డఫ్ మధ్య పోటీ జరిగింది. ఇందులో బాంబేలా విజయం సాధించారు. తర్వాత జరిగిన పోటీలో తైపీ క్రీడాకారిణి లిన్ షి చియాతో ఆమె పోటీపడ్డారు. లిన్ షి చియాను రౌండ్-32 లో 6-2 తేడాతో ఓడించి రౌండ్-16కు దూసుకెళ్లింది బాంబేలా. ఇటీవల రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుని ఆ తర్వాత రష్యా తో జరిగిన పోటీలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ టీమ్ లో బాంబేలా దేవి ఒక మెంబర్.
Mobile AppDownload and get updated news