ఆంధ్రప్రదేశ్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు అనంతపురంలో నీలం సంజీవ రెడ్డి స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ శాఖలు తయారుచేసిన శకటాలు స్టేడియంలోకి అడుగుపెట్టాయి. వాటిని వీక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య వచ్చాక అనంతపురంలో మొదటిసారి రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య వేడుకలు జరుగుతుండడంతో అక్కడి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. భారీగా స్టేడియానికి తరలి వచ్చారు. జెండా ఆవిష్కరణకు ముందు సీఎం చంద్రబాబు టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Mobile AppDownload and get updated news