Mobile AppDownload and get updated news
ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరింది. గత జూన్‌లో 26 ఏళ్ల ఆష్పాఖ్ అహ్మద్ తన భార్య, కూతురు, వరుసకు సోదరులయ్యే మరో ఇద్దరితో కలిసి ఐసిస్‌లో చేరడానికి దేశం విడిచి వెళ్లారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి ముందు వారికి ఆ ఉగ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని తేలింది. నేను ఇస్లామిక్ స్టేట్‌లో చేరుతున్నానని, మళ్లీ తిరిగి రానని ఆష్పాఖ్ జూన్ చివరి వారంలో తన చిన్న తమ్ముడికి మెసేజ్ పంపాడు. అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోమని కోరాడు. ఆ కుటుంబం ఉగ్రవాద సంస్థలో చేరడం వెనుక ఇస్లాం మత ప్రబోధకుడు మహ్మద్ హానీఫ్ పాత్ర ఏ మేరకు ఉందనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. 2014లో తమకు చెప్పకుండానే ఆష్ఫాఖ్ పెళ్లి చేసుకున్నాడని, తర్వాత తన వివాహం గురించి సమాచారం ఇచ్చాడని అతడి తండ్రి తెలిపాడు. రెండేళ్లుగా తన కొడుకు ప్రవర్తనలో మార్పు వచ్చిందని, టీవీ చూడటం, సంగీతం వినడం మానేశాడని చెప్పాడు. గడ్డం పెంచడం మొదలు పెట్టాడని, వస్త్రధారణ కూడా మర్చాడని ఆయన తెలిపాడు. గత మార్చిలో భార్యను తీసుకొని మత విషయాలను తెలుసుకునేందుకు అతడు శ్రీలంక వెళ్లాడని తెలిసింది. తన కుమారుడు ఐసిస్‌లో చేరేందుకు కారణమయ్యారని ఆరోపిస్తూ అతడి తండ్రి అబ్దుల్ మజీద్ ఆగష్టు 6న హానీఫ్‌తోపాటు అబ్దుర్ రషీద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇస్లాం మత ప్రబోధకుడైన హానీఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ విషయమై విచారణ జరుపుతున్నారు. కేరళలో స్కూల్ టీచర్‌గా పనిచేసే అబ్దుర్ తన కొడుకు సిరియా తీసుకెళ్లాడని మజీద్ ఆరోపించారు.