హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో నిందితుడు, మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు గుండెపోటుతోనే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభాకర్ రావుది ఆత్మహత్య లేదా గుండెపోటా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు డేవిడ్ ప్రశాంత్ స్పందిస్తూ తన తండ్రిది సహజ మరణమేనని తేల్చి చెప్పారు. ఆయన ఉదయం తీవ్ర గుండెపోటుతో బాధపడుతున్న సమయంలో ఆస్ప్రతికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని అయితే మార్గం మధ్య లోనే ఆయన తుది శ్వాస విడిచారని వెల్లడించారు. తన తండ్రి మరణాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని మీడియాను వేడుకున్నారు. పోలీసుల విచారణకు తమ కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరిస్తారని డేవిడ్ ప్రశాంత్ తెలిపారు.
Mobile AppDownload and get updated news